దుమ్మురేపిన టాటా మోటార్స్‌..! కంపెనీకి కాసుల వర్షమే..! | Tata Motors Records 38 Percent Growth In PV Sales | Sakshi
Sakshi News home page

Tata Motors: దుమ్మురేపిన టాటా మోటార్స్‌..! కంపెనీకి కాసుల వర్షమే..!

Dec 1 2021 4:03 PM | Updated on Dec 1 2021 5:36 PM

Tata Motors Records 38 Percent Growth In PV Sales - Sakshi

ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో టాటామోటార్స్‌ దుమ్మురేపింది. వాహన కొనుగోలుదారులు కంపెనీకి కాసుల  వర్షం కురిపించారు. 2021 నవంబర్‌ నెలల్లో 62,192 ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలను టాటామోటార్స్‌ జరిపింది. ఈ సంఖ్య గత ఏడాది పోలిస్తే.. 38 శాతం అధికం.  సుమారు  29,778 యూనిట్ల మేర అమ్మకాలను టాటా మోటార్స్‌ జరిపింది. 

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో టాటా జోరు..!
ప్యాసింజర్ వెహికల్ విభాగంలో... నవంబర్ 2021లో పెట్రోల్‌, డిజిల్‌ వాహనాల్లో 28,027 యూనిట్ల అమ్మకాలను టాటా మోటార్స్‌ నమోదుచేసింది. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే 32 శాతం మేర వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా టాటామోటార్స్‌ అదరగొట్టింది. నవంబర్ 2020తో పోలిస్తే ఏకంగా 324 శాతం పెరిగి 1,751 యూనిట్లను నవంబర్‌ 2021లో విక్రయాలను జరిపింది. 

మొత్తంగా 62,192 యూనిట్ల విక్రయం..!
దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఏడాది నవంబర్‌ నెలలో సుమారు 62,192 యూనిట్ల విక్రయాలను  టాటామోటార్స్‌ జరిపింది. వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌ కొద్దిమేరనే వృద్ధిని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 15 శాతం మేర విక్రయించింది.
చదవండి: ఢిల్లీలో లీటరు పెట్రోలుపై రూ.8 తగ్గింపు.. కారణం ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement