Tata: పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్.. అదిరిపోయిన టాటా మోటార్స్‌ సీఎన్‌జీ కార్స్!

Tata Launched Tiago, Tigor CNG Variants In India - Sakshi

Tata Motors‌ Company: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ సీఎన్‌జీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. టియాగో, టిగోర్‌ మోడల్స్‌లో ఐసీఎన్‌జీ వేరియంట్స్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.6.09 లక్షల నుంచి రూ.8.29 లక్షల వరకు ఉంది. టాటా టిగోర్ సీఎన్‌జీ ధర రూ.7.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టియాగో, టిగోర్‌ అమ్మకాల్లో 30-35 శాతం సీఎన్‌జీ విభాగం కైవసం చేసుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. భారత్‌లో కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) కార్ల అమ్మకాల్లో 2019-20లో 60 శాతం, గత ఆర్థిక సంవత్సరంలో 97 శాతం వృద్ధి నమోదైంది. 

సీఎన్‌జీ వాహనాలకు కస్టమర్ల నుంచి ఆసక్తి పెరుగుతుండగా, బీఎస్‌-6 ప్రమాణాల రాకతో డీజిల్‌ హ్యాచ్‌బ్యాక్స్, కాంపాక్ట్‌ సెడాన్స్‌కు డిమాండ్‌ పూర్తిగా కనుమరుగైందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్ ఈ విభాగంలో కార్లను విక్రయిస్తున్నాయి. టియాగో సీఎన్‌జీ, టిగోర్ సీఎన్‌జీ రెండూ పూర్తి ట్యాంక్ చేస్తే 300 కిలోమీటర్లు వరకు వెళ్లనున్నాయి. టాటా టియాగో సీఎన్‌జీ 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పాటు పనిచేసే హ్యాచ్ బ్యాక్ కు అమర్చిన సీఎన్‌జీ కిట్తో వస్తుంది. ఇంజిన్ 73 పీఎస్ పవర్ అవుట్ పుట్ ఉత్పత్తి చేస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మి.మీగా ఉంది. టియాగో సీఎన్‌జీ మాదిరిగానే టిగోర్ సీఎన్‌జీ కూడా 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీని ఇంజిన్ కూడా 73 పీఎస్ పవర్ అవుట్ పుట్ ఉత్పత్తి చేస్తుంది.

(చదవండి: SEBI Saa₹thi App: ఇన్వెస్టర్లకు అండగా సెబీ ‘సారథి’ యాప్‌..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top