టాటా గ్రూప్‌ కిట్‌లో 1ఎంజీ

Tata Digital to acquire majority stake in online pharmacy 1mg - Sakshi

మెజారిటీ వాటా కొనుగోలుకి రెడీ క్యూర్‌ఫిట్‌లో రూ. 550 కోట్ల పెట్టుబడి డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధిలో భాగం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌ మార్కెట్‌ప్లేస్‌.. 1ఎంజీ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు టాటా సన్స్‌ సొంత అనుబంధ సంస్థ టాటా డిజిటల్‌ తాజాగా పేర్కొవాటా విలువను వెల్లడించలేదు. కంపెనీ ఇటీవలే ఫిట్‌నెస్‌ సంబంధ సేవలందించే క్యూర్‌ఫిట్‌ హెల్త్‌కేర్‌లో 7.5 కోట్ల డాలర్లు(రూ. 550 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా క్యూర్‌ఫిట్‌లో వాటాను సొంతం చేసుకోనుంది.

కాగా.. విభిన్న విభాగాలలో వినియోగదారుడి అవసరాలను ఒకే గొడుగు కింద అందించేందుకు వీలుగా డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా డిజిటల్‌ వివరించింది. ఈ ప్రణాళికల్లో భాగంగానే 1ఎంజీలో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్‌ వ్యవస్థలో ఈఫార్మసీ, ఈడయాగ్నోస్టిక్స్, టెలి కన్సల్టేషన్‌ కీలక విభాగాలుగా నిలవనున్నట్లు వెల్లడించింది. ఇవి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా హెల్త్‌కేర్‌ విభాగం మరింత జోరు చూపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ విభాగంలో 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 7,300 కోట్లు) మార్కెట్‌ ఉన్నట్లు తెలియజేసింది. వార్షికంగా 50 శాతం చొప్పున వృద్ధి సాధిస్తున్నట్లు వివరించింది.  

1ఎంజీ బ్యాక్‌గ్రౌండ్‌
2015లో ప్రారంభమైన 1ఎంజీ ఈహెల్త్‌ విభాగంలో మెడిసిన్స్, వెల్‌నెస్‌ ప్రొడక్టులు, డయాగ్నోస్టిక్‌ సర్వీసులు, టెలి కన్సల్టేషన్‌ తదితర పలు సేవలు అందిస్తోంది. ఆధునిక డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లతోపాటు.. మెడిసిన్స్, ఇతర ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తుల పంపిణీ నిర్వహిస్తోంది. కాగా.. ఈ వారం మొదట్లో రూ. 550 కోట్లతో క్యూర్‌ఫిట్‌లో వాటా కొనుగోలు చేస్తున్నట్లు టాటా సన్స్‌ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా క్యూర్‌ఫిట్‌ వ్యవస్థాపకుడు, సీఈవో ముకేశ్‌ బన్సల్‌కు టాటా డిజిటల్‌లో ప్రెసిడెంట్‌గా ఎగ్జిక్యూటివ్‌ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలియజేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top