పెరిగిన చక్కెర ఉత్పత్తి

Sugar production up 52per cent to 42.9 lakh tonnes till November - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో అక్టోబర్‌–నవంబర్‌ మధ్య కాలంలో చక్కెర ఉత్పత్తి రెండు రెట్లు పెరిగి 42.9 లక్షల టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఉత్పత్తి 20.72 లక్షల టన్నులుగా ఉందని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) తెలిపింది. ఈ సీజన్‌లో షుగర్‌కేన్‌ క్రషింగ్‌ త్వరగా ప్రారంభం కావటమే ఉత్పత్తి పెరగడానికి ప్రధాన కారణమని ఐఎస్‌ఎంఏ పేర్కొంది. 2018–19 సంవత్సరంలోనూ ప్రొడక్షన్స్‌ ఇదే తీరులో జరిగిందని.. ఆ సమయంలో 418 షుగర్‌ మిల్లుల నుంచి 40.69 లక్షల టన్నులు చక్కెర ఉత్పత్తి జరిగింది.

ఈ సీజన్‌లో ఉత్తర ప్రదేశ్‌ అత్యధికంగా చక్కెర ఉత్పత్తి జరిగింది. గతేడాది 11.46 లక్షల టన్నులుండగా.. ప్రస్తుతమిది 12.65 లక్షల టన్నులకు పెరిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 15.72 లక్షల టన్నులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 1.38 లక్షల టన్నులుగా ఉంది.  కర్నాటకలో 5.62 లక్షల టన్నుల నుంచి 11.11 లక్షల టన్నులకు పెరిగింది. ప్రస్తుత సీజన్‌లో ప్రధాన రాష్ట్రాల్లో సగటు షుగర్‌ మిల్‌ చక్కెర ధరలు తగ్గినట్లు ఇస్మా గుర్తించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top