బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా, వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. దీంతో సిల్వర్ రేట్లలో కొంత మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
గత ఆదివారం అంటే.. మార్చి 29న కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ.2.50 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. శనివారం (ఏప్రిల్ 4) నాటికి రూ.2.55 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో ధర పెరుగుతూ.. తగ్గుతూ కొత్త మార్కుకు చేరిందన్నమాట. ఈ ధరలు గత నెలతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. ఇదే ధరలు బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఉన్నాయి.
ఢిల్లీలో మాత్రం వారం రోజుల్లో సిల్వర్ రేటు రూ.2.45 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు చేరింది. నిజానికి దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే రాజధాని నగరంలో కొంత తక్కువగానే ఉంటుంది.
వెండి ధరలు పెరగడానికి కారణాలు
డిమాండ్ పెరగడం: వెండి నగలు (జ్యువెలరీ), ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిశ్రమలలో వినియోగం పెరిగితే వెండి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి.
సరఫరా తగ్గడం: గనుల్లో ఉత్పత్తి తగ్గడం లేదా సరఫరాలో అంతరాయం కలిగితే మార్కెట్‌లో వెండి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి.
ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బును భద్ర పెట్టుబడులలో పెట్టాలని చూస్తారు. అప్పుడు వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరుగుతుంది.
కరెన్సీ విలువ తగ్గడం: ముఖ్యంగా డాలర్ విలువ పడిపోతే, వెండి ధరలు పెరుగుతాయి.
పెట్టుబడిదారుల ఆసక్తి: స్టాక్ మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వెండి వంటి ఆస్తులలో పెట్టుబడి పెడతారు.
జియోపాలిటికల్ పరిస్థితులు: యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ప్రజలు సురక్షిత పెట్టుబడులను ఆశ్రయిస్తారు. కాబట్టి వెండి ధరలు పెరుగుతాయి.
ప్రభుత్వ విధానాలు: దిగుమతి సుంకాలు, పన్నులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.


