StockMarketOpening: రిలయన్స్ జోరు, సెన్సెక్స్ 60వేల ఎగువకు

18 వేలకు చేరువలో నిఫ్టీ
60 వేలను దాటేసిన సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు పటిష్టంగా ప్రారంభమైనాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో కీలక సూచీలు రెండూ పాజిటివ్‌గా ఉన్నాయి. సెన్సెక్స్ 215 పాయింట్లుఎగిసి 60009 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 77 పాయింట్లు లాభంతో 178910 వద్ద ట్రేడ్ అవుతోంది.తద్వారా సెన్సెక్స్ 60 వేల ఎగువకు చేరింది. అలాగే నిఫ్టీ 18వేలకు అతి చేరువలో ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా ఐటీ లాభ పడుతుండగా, బ్యాంకింగ్ సెక్టార్ నష్టపోతోంది.
ముఖ్యంగా రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ , టాప్ ఇండెక్స్ గెయినర్స్‌గా ఉన్నాయి. అయితే బ్యాంకింగ్ షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
మరిన్ని వార్తలు