
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎ గిసి కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను అధిగమించాయి. ఐటీ, టెక్నాలజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో కౌంటర్లు ఇవాళ్టి మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 50104వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 14807 వద్ద ట్రేడవుతోన్నాయి.
ఫెడరల్ రిజర్వ్ దాదాపు 40 ఏళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధించనుందని దాదాపు 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోనుందని ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌లాభాల్లో ఉండగా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ దివిస్ ల్యాబ్స్ , బ్రిటానియా టాప్‌లూజర్స్‌గా ఉన్నాయి.