StockMarketClosing: వారాంతంలో లాభాలతో పటిష్ట ముగింపు

వారాంతంలో పటిష్ట ముగింపు
17800 ఎగువకు నిఫ్టీ
ఐటీ జోష్, పవర్, రియల్టీ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్ల లాభాలు వారంతంలో కీలక సూచీలు పటిష్టంగా ముగిసేందుకు తోడ్పడ్డాయి. చివరికి సెన్సెక్స్ 104 పాయింట్లు ఎగిసి 59793 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 17883 వద్ద పటిష్టంగా ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్ 60వేల మార్క్‌ను టచ్ చేసింది. అయితే రియల్టీ, పవర్ రంగ షేర్ల నష్టాలు బలహీపనర్చాయి.
టెక్ మహీంద్ర, అదానీ పోర్ట్స్, ఇండస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ లాభ పడగా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, టైటన్ ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 16 పాయింట్లు ఎగిసి 79.58 వద్ద ముగిసింది.
మరిన్ని వార్తలు