బ్యాంకింగ్‌ షాక్ ‌:  49 వేల దిగుకు సెన్సెక్స్‌  | Sensex Drops Over 700 Points ends below 49k | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ షాక్‌ : 49 వేల దిగుకు సెన్సెక్స్‌ 

Jan 22 2021 3:43 PM | Updated on Jan 22 2021 4:57 PM

 Sensex Drops Over 700 Points ends below 49k - Sakshi

సాక్షి,ముంబై: చారిత్రక గరిష్టాలనుంచి  కీలక  సూచీలు వెనక్కి  తగ్గాయి. గ్లోబల్‌ మార్కెట్లు పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ ఆరంభంలో లాభాల్లో ఉన్నా ఆతరువాత నుంచి  అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ప్రధానంగా  బ్యాంకింగ్ ఇండెక్స్‌లో భారీ అమ్మకాల వెల్లువ కురిసింది.  దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 1000పాయింట్లు కుప్పకూలింది. లాభనష్టాల మధ్య కదలాడిన సెన్సెక్స్‌ చివరికి సెన్సెక్స్‌ 746 పాయింట్ల నష్టంతో 48878 వద్ద  49 వేల  స్థాయినికూడా కోల్పోయింది. అటు నిఫ్టీ  కూడా ఏకంగా 218  పాయింట్ల నష్టంతో 14372 వద్ద 14400 వేల దిగుకు చేరింది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఆటో తప్ప మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిసాయి. 

టాటా మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. యాక్సిస్‌,ఐసీఐసీఐ,హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ఫైనాన్స్‌  డాక్టర్‌ రెడ్డీ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  మరోవైపు టాటా మోటార్స్‌  బజాజ్‌ ఆటో,  ఐషర్‌ మోటార్స్‌ , హీరోమోటోకార్ప్‌, బ్రిటానియా నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement