నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు, ఐటీ షేర్ల ర్యాలీ | Sakshi
Sakshi News home page

TodayStockMarketupdate: ఆరంభ లాభాలన్నీ ఆవిరి, ఐటీ షేర్ల ర్యాలీ

Published Mon, Jan 16 2023 3:34 PM

sensex and nifty ended in losses it shares rally - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో  ముగిసాయి.  అంతర్జాతీ  మార్కెట్ల సానుకూల సంకేతాలతో సోమవారం ఆరంభంలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన సూచీలు   తరువాత  250 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 168  పాయింట్ల నష్టంతో 60093వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 17895వద్ద ముగిసింది. ఐటీ మినహా  బ్యాంకింగ్‌, మెటల్‌, ఆటోఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. 

టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హీరోమోటో భారీగా లాభపడగా,  అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, యాక్సిస్‌ బ్యాంకు, టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల​, హిందాల్కో నష్టపోయాయి.   అటు డాలర్‌ మారకంలో రూపాయి 39 పాయింట్లు  నష్టంతో 81.64 వద్ద ఉంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement