ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు భారీ షాక్‌!

Sbi Credit Card Rules Changing From Today 17 March 2023 - Sakshi

వినియోగదారులకు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగం భారీ షాకిచ్చింది. ఈ నెల 17 నుంచి సర్వీస్‌ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించింది. దీంతో గతంలో రూ.99 ఉన్న ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ ఛార్జీలు ఇప్పుడు రూ.199లకు పెరిగాయి. వీటితోపాటు జీఎస్టీ, ఇతర పన్నులు కూడా అదనంగా కలిశాయి.ఈ మేరకు క్రెడిట్‌ కార్డ్‌ విభాగం వినియోగదారులకు సమాచారం అందించింది. 

ఇక వీటితో పాటు సింప్లీ క్లిక్‌ కార్డు హోల్డర్లకు గిఫ్ట్‌ కార్డుల రీడింప్షన్‌, రివార్డు పాయింట్ల రీడిమ్‌ నిబంధనలు మారాయని, ఈ నిబంధనల్లో మార్పులు ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ కార్డ్‌ మరోసారి గుర్తు చేసింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ సింప్లీక్లిక్ కార్డ్ హోల్డర్‌లకు క్లియర్‌ట్రిప్‌ వోచర్‌ను అందించింది. ఆ వోచర్‌ను జనవరి 6, 2023 నుండి ఒకే సారి ఉపయోగించాలి. అంతే తప్పా ఇతర ఆఫర్లు లేదా వోచర్లతో కలపకూడదని స్పష్టం చేసింది. 

సింప్లీక్లిక్/సింప్లీక్లిక్ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డ్‌తో అమెజాన్‌ షాపింగ్‌పైలో ఆన్‌లైన్ ఖర్చులపై 10X రివార్డ్ పాయింట్‌ల అందించేది. కానీ జనవరి 1 నుండి ఆ రివార్డ్‌ పాయింట్లు  5Xకి తగ్గించింది. అపొలో24X7, బుక్‌మై షో, క్లియర్‌ ట్రిప్‌, ఈజీ డైనర్‌, లెన్స్‌కార్ట్‌, నెట్‌మెడ్స్‌ వేదికల్లో ఆన్‌లైన్‌ కొనుగోళ్ల మీద మాత్రం 10x రివార్డు పాయింట్లు కొనసాగుతాయి’ అని ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top