బడ్జెట్‌ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌, ధర ఎంతంటే!

Samsung Galaxy F13 To Launch In India Today - Sakshi

స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లను పెంచుకునేందుకు ఇటీవల ప్రముఖ సౌత్‌ కొరియా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌  ఫీచర్‌ ఫోన్‌ల తయారీని నిలిపివేసింది. వాటి స్థానంలో బడ్జెట్‌ ధరల్లో కొనుగోలు దారులకు స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో రీజనబుల్‌ ప్రైస్‌తో రోజు దేశీయ మార్కెట్‌లో శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది.     

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు
శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 జున్‌ 22 (ఈరోజు మధ్యాహ్నం) భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఫోన్‌ విడుదలతో గెలాక్సీ ఎఫ్‌13 ఫీచర్లు సైతం రివిల్‌ అయ్యాయి.6000 ఏఎంహెచ్‌ బ్యాటరీ, 5000ఏఎంహెచ్‌ బ్యాటరీ కెపాసిటీతో విడుదలైన ఈ ఫోన్‌ రెడ్‌ మీ10 ప్రైమ్‌, రియల్‌ మీ నార్జ్‌ 50ఏ ప్రైమ్‌, పోకో ఎంపీ3 5జీ ఫోన్‌లకు కాంపిటీటర్‌గా మారనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఈ ఫోన్‌ 1080*2,408 ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే,4జీబీ ర్యామ్‌తో ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌,  5మెగా పిక్సెల్‌ అల్ట్రావైడ్‌తో 50 మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌, 2మెగా పిక్సెల్‌ డెప్త్‌ సెన్సార్‌, సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా,128జీబీ నుంచి 1టెరా బైట్‌ వరకు ఇంట్రనల్‌ స్టోరేజ్‌ సౌకర్యం ఉంది.  

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 13 ఫోన్‌ ధర
4జీబీ ర్యామ్‌ ప్లస్‌ 64జీబీ స్టాంగ్‌ వేరియంట్‌తో శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 ఫోన్‌ విడుదలైంది. ఇక ఈ ఫోన్‌ 4జీబీ ప్లస్‌ 128జీబీ వేరియంట్‌ మోడల్‌ ధర రూ.12,999 ఉండగా నైట్‌ స్కై గ్రీన్‌, సన్‌రైజ్‌ కూపర్‌, వాటర్‌ ఫాల్‌ బ్లూ కలర్‌లలో లభ్యం కానుండగా.. జూన్‌ 29నుంచి ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌తో పాటు పలు రిటైల్‌ స్టోర్‌లలో లభ్యం కానుంది. 

 

గంటలో ఫోన్‌ ఫుల్‌ ఛార్జింగ్‌ ఎక్కేలా 15డబ్ల్యూ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందిస్తుంది. దీంతో పాటు 8జీబీ ర్యామ్‌ను అందిస్తుండగా..దాని కెపాసిటీని పెంచేందుకు ర్యామ్‌ ప్లస్‌ టెక్నాలజీని అందిస్తుంది. తద్వారా ఎక్కువ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నా ఫోన్‌ డెడ్‌ అవ్వకుండా ఈజీగా హ్యాండిల్‌ చేసుకునే సదుపాయం ఉంది. 

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 పై ఆఫర్లు 
బుధవారం విడుదలైన ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్‌స్టంట్‌ బ్యాంక్‌ డిస్కౌంట్‌తో పాటు గూగుల్‌ నెస్ట్‌ మినీ, నెస్ట్‌ హబ్‌లను తక్కువ ధరకే పొంద వచ్చు. 

 చదవండి👉శాంసంగ్‌ షాకింగ్‌ నిర్ణయం..ఆ సిరీస్‌ ఫోన్‌ తయారీ నిలిపివేత! ఎందుకంటే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top