
73 పైసలు బలపడి 86.05 వద్ద ముగింపు
చల్లారిన క్రూడాయిల్ ధరల ప్రభావం
ముంబై: రూపాయి విలువ అయిదు నెలల కనిష్టం నుంచి కోలుకొని రికార్డు స్థాయిలో ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో 73 పైసలు బలపడి 86.05 వద్ద స్థిరపడింది. గడిచిన అయిదేళ్లలో ఒకేరోజు ఈ స్థాయిలో పుంజుకో వడం ఇదే తొలిసారి.
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు తగ్గొచ్చనే అంచనాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం రూపాయికి కలిసొచ్చిన. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో నెలకొన్న సానుకూల సంకేతాలూ ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో ఏకంగా 87 పైసలు ఎగసి 85.91 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య సీజ్‌ఫైర్ ప్రకటనతో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 3.50% క్షీణించి 67.05 స్థాయికి దిగివచ్చింది.