Royal Enfield: పెరిగిన బైకుల ధరలు

Royal Enfield Increased Price Of Classic, Meteor And Other Models - Sakshi

న్యూఢిల్లీ: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన బైకుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తయారీ ఖర్చు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి వస్తోన్న క్లాసిక్‌ 350, బెల్లెట్‌ 350, మీటియర్‌ 350, హిమాలయన్‌, ఇంటర్‌సెప్టార్‌ 650, కాంటినెంటల్‌ జీటీ 650 మోడల్స్‌పై ధరలు పెంచింది. జులై 1 నుంచి పెరిగిన ధరలు వర్తిస్తున్నాయి.

4.25 శాతం
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి మార్కెట్‌లో ఉన్న వెహికల్స్‌లో క్లాసిక్‌ 350 మోడల్‌ అమ్మకాలు ఎక్కువ. దీంతో పాటు ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన మోడల్‌ మీటియర్‌ 350. ఈ రెండు మోడల్స్‌కి సంబంధించిన ధరలే అధికంగా పెరిగాయి. క్లాసిక్‌ 350పై 4.24 శాతం, మీటియర్‌ 350పై 4.25 శాతం ధరలు అధికం అయ్యాయి. పెరిగిన ధరలు జులై నుంచి అమ్మలోకి రానున్నాయి.

పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి (రూపాయల్లో)
మీటియర్‌ వేరియంట్స్‌        కొత్తధర         పాతధర
ఫైర్‌బాల్‌                              1,92,109        1,84,319
స్టెల్లార్‌                                 1,98,099        1,90,079
సూపర్‌నోవా                          2,08,084        1,99,679

బుల్లెట్‌ 350                          కొత్తధర        పాతధర
సిల్వర్‌ ఓనిక్స్‌బ్లాక్‌                1,58,485        1,53,718
బ్లాక్‌                                       1,65,754        1,60,775
350 ఈఎస్‌                            1,82,190        1,76,731
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top