విస్తరణ దిశగా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ | Sakshi
Sakshi News home page

విస్తరణ దిశగా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌

Published Thu, Nov 30 2023 4:31 AM

RBL Bank eyes to open 226 new branches in 3 years - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ విస్తరణపై దృష్టి సారించింది. వచ్చే మూడేళ్లలో 226 శాఖలను అదనంగా జోడించుకుంటామని ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఉన్న మొత్తం వ్యాపారం (డిపాజిట్లు, రుణాలు) రూ.1.55 లక్షల కోట్లను 2026 మార్చి నాటికి రూ.2.70 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి 514 శాఖలు ఉండగా, 2026 మార్చి నాటికి వీటిని 740కు తీసుకెళతామని ప్రకటించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 190 జిల్లాల పరిధిలో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.84,887 కోట్లుగా ఉన్న డిపాజిట్లను రూ.1.45 లక్షల కోట్లకు పెంచుకోవాలని అనుకుంటోంది. అదే సమయంలో రుణాలు రూ.70,209 కోట్లుగా ఉంటే, వీటిని రూ.1.25 లక్షల కోట్లకు విస్తరించాలనే ప్రణాళికలతో ఉంది. ఈ వివరాలను ఇన్వెస్టర్‌ ప్రెజెంటేషన్‌లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ పేర్కొంది. మార్చి నాటికి హోల్‌ సేల్, రిటైల్‌ రుణాల నిష్పత్తి 46:54గా ఉంటే, దీన్ని 35:65 రేషియోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. 

Advertisement
Advertisement