Get One Crore Rupees With Rare One Rupee Coin: Check Complete Details - Sakshi
Sakshi News home page

ఈ అరుదైన రూ. 1 కాయిన్‌కు కోటి రూపాయలా..!

Jul 29 2021 6:53 PM | Updated on Jul 29 2021 8:08 PM

A Rare One Rupee Coin Can Fetch You Up To One Crore - Sakshi

గత కొన్ని రోజులుగా పాత రూ. 2, రూ. 5, రూ.10, 25 పైసల కాయిన్స్‌ను భారీ మొత్తంలో ఆన్‌లైన్‌ మార్కెట్‌లో విక్రయించడం చూసే ఉంటారు. చాలా మంది తమ దగ్గరున్న అరుదైన పాత నాణేలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ భారీ మొత్తంలో నగదును సంపాదిస్తున్నారు. కొంత మంది కాయిన్స్‌ను సేకరించే అభిరుచి ఉన్నవారు ఆన్‌లైన్‌లో వారికి నచ్చిన అరుదైన కాయిన్స్‌ను కొనుగోలు చేయడానికి ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఈ అరుదైన కాయిన్స్‌ను ఎక్కువగా ఇండియా మార్ట్‌లో విక్రయించడం గమనించవచ్చును.

తాజాగా 1885 సంవత్సరానికి చెందిన రూ.1 కాయిన్‌ను కోటి రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ కాయిన్‌ ప్రత్యేకత ఏమిటంటే..ఈ కాయిన్‌పై విక్టోరియా మహారాణి చిత్రం ఉంది. దాంతో పాటుగా బ్రిటిష్‌ కింగ్‌ జార్జ్‌-5 చిత్రం కాయిన్‌ ఉన్న అరుదైన కాయిన్‌కు ఆన్‌లైన్‌లో కోటి రూపాయాలు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అరుదైన కాయిన్‌ను ఇండియా మార్ట్‌లో కొనుగోలుదారులతో చర్చించడంతో భారీ మొత్తంలో నగదును పొందవచ్చును. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కాయిన్‌ ఉంటే ఇండియామార్ట్‌లో రిజిస్టరై కొనుగోలుదారులతో చర్చించి భారీ మొత్తాన్ని పొందవచ్చును. అరుదైన కాయిన్స్‌ను, నోట్లను సేకరించే వారిని న్యూమిస్మాటిక్స్‌ అని పిలుస్తారు. వీరు అరుదైన కాయిన్లను, నోట్లను సేకరించి అధ్యయనం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement