499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్

Power Bank Days Sale On Amazon get 1000mAh Power Bank Only At 499 - Sakshi

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరు నిత్యం ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాక్‌అప్. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా వాడటం బాగా పెరిగినప్పటి నుండి ఫోన్ యొక్క బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా పని మీద వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, విహార యాత్రలకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మధ్య పవర్ బ్యాంక్ వాడకం కూడా బాగా పెరిగింది. మీరు కూడా కొత్త పవర్ బ్యాంక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది ఒక మంచి సమయం. అమెజాన్ లో తాజాగా పవర్ బ్యాంక్ డేస్ సేల్ ఈ రోజు (డిసెంబర్ 13) నుండి నిర్వహిస్తుంది. ఈ సేల్ మూడు రోజుల పాటు(డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 15) కొనసాగుతుంది. ఈ సేల్ లో మీకు తక్కువ ధరకే మంచి నాణ్యత గల పవర్ బ్యాంక్ లు లభిస్తాయి. ఈ సేల్ లో తీసుకొచ్చిన కొన్ని పవర్ బ్యాంకు వివరాలు మీకు అందిస్తున్నాం.(చదవండి: నోకియా 5.4లో సూపర్ ఫీచర్స్)

రెడ్‌మీ పవర్‌బ్యాంక్: రెడ్‌మి యొక్క ఈ పవర్ బ్యాంక్ 10000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది, దీని ధర 699 రూపాయలు మాత్రమే. పవర్‌బ్యాంక్ బరువు 246.5 గ్రాములు. ఛార్జ్ చేయడానికి 7.5 గంటలు పడుతుంది. దీనికి రెండు అవుట్పుట్ పోర్టులు మరియు రెండు ఇన్పుట్ పోర్టులు ఉన్నాయి.|
అంబ్రేన్ పవర్‌బ్యాంక్: అంబ్రేన్‌కు చెందిన ఈ పవర్‌బ్యాంక్ ధర 649 రూపాయలు. పవర్‌బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుండి 7 గంటలు పడుతుంది. 
సిస్కా పవర్‌బ్యాంక్: సిస్కోకు చెందిన 10000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన ఈ పవర్‌బ్యాంక్ ధర రూ.599. దీనికి ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్ కూడా లభిస్తుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ పవర్‌బ్యాంక్‌లో ఓవర్‌ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ రక్షణ కూడా ఇవ్వబడింది.
యూఆర్బీఎన్(URBN) పవర్‌బ్యాంక్: యూఆర్బీఎన్ పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఈ సేల్ లో అతి తక్కువ ధరకు రూ.499 లభించేది ఇదే.  ఈ అల్ట్రా స్లిమ్ పవర్‌బ్యాంక్ 10000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఇది 12వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. పవర్‌బ్యాంక్ బరువు కేవలం 354 గ్రాములు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top