మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్

పినకిల్ ‘ఎవల్యూషనారి’ ప్రయోగం
పుణె: ఆటోమోటివ్ తయారీ రంగంలో మహిళా సిబ్బందిని పెంచే దిశగా పినకిల్ ఇండస్ట్రీస్ కొత్తగా ‘ఎవల్యూషనారీ’ పేరిట వినూత్న ప్రయోగం చేపట్టింది. కేవలం మహిళలను మాత్రమే నియమించుకునేందుకు ఫిబ్రవరి 23, 24న మధ్యప్రదేశ్ పిఠంపూర్‌లోని తమ ప్లాంటులో రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది.
ఆసక్తి గల మహిళా అభ్యర్ధులు httpr:// pinnac eindurtrier. com/ evo utionari& campaifn/లో లేదా పినకిల్ ఇండస్ట్రీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదు చేసుకోవచ్చని లేదా నేరుగా వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని సంస్థ తెలిపింది.
కెరియర్‌లో విరామం తీసుకున్నప్పటికీ అర్హత కలిగిన మహిళా ఇంజినీర్లు, నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రెసిడెంట్ అరిహంత్ మెహతా తెలిపారు. మెకానికల్, ఎలక్ట్రికల్, రోబోటిక్స్ తదితర విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉన్న ఇంజినీర్లతో పాటు ఆర్‌అండ్‌డీ, ఆపరేషన్స్, స్టోర్స్ తదితర విభాగాల్లోనూ నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆటోమోటివ్ సీటింగ్, ఇంటిరీయర్స్, రైల్వే సీటింగ్ మొదలైన విభాగాల్లో పినాకిల్ కార్యకలాపాలు సాగిస్తోంది.
మరిన్ని వార్తలు :