
రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగించే యోచన చేయడంలేదని టెలికం శాఖ స్పష్టం చేసింది. కంపెనీ స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్) బకాయిలపై ప్రస్తుతం తమవద్ద ఎలాంటి ప్రణాళికలు లేదా ఆలోచనలు లేవని కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
‘ఇటీవల కంపెనీకున్న భారీ రుణ భారాన్ని ఈక్విటీగా మార్పు చేసుకున్నాం. ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇది చేపట్టాం. ప్రభుత్వం చేయదలచినదంతా ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం వీటిపై ఎలాంటి సమాలోచనలూ చేయడంలేదు’ అంటూ స్పష్టతనిచ్చారు. స్పెక్ట్రమ్ వేలం బకాయిలకుగాను మార్చిలో ప్రభుత్వం రూ. 36,950 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోవడం ద్వారా వొడాఫోన్ ఐడియాలో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇంతక్రితం 2023లోనూ ప్రభుత్వం రూ. 16,000 కోట్ల బకాయిలకుగాను వొడాఫోన్ ఐడియాలో 33 శాతం వాటాను అందుకోవడం గమనార్హం! 2025 జూన్‌కల్లా కంపెనీ ఏజీఆర్ లయబిలిటీ రూ.75,000 కోట్లుగా నమోదైంది.
ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?