
భారతదేశంలో ఎన్నో సామాజిక వర్గాలకు చెందినవారు వ్యాపారాలు సాగిస్తున్నారు. అందులో చాలామంది విజయం సాధిస్తున్నారు. అయితే మార్వాడీ సామాజిక వర్గానికి మాత్రం వ్యాపారం చేయడంలో, అందులో విజయం సాధించడంలో ప్రత్యేక స్థానం ఉంది. వారి ఆర్థిక ఆలోచనా విధానం, వ్యాపార పద్ధతులు కాస్త భిన్నంగా ఉంటాయి. దాంతో వీరు వ్యాపారంలో ముందుంటున్నారనే వాదనలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీసుకురావడంలో ఈ వర్గం ప్రావీణ్యం పొందిందని కొందరు చెబుతుంటారు. అయితే వీరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
చిన్నతనం నుంచే...
మార్వాడీ కుటుంబాల్లో చిన్నప్పటి నుంచే వ్యాపార అంశాలను పిల్లలకు నేర్పిస్తారు. చాలా షాపులు, వ్యాపారాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే మెలకువలు నేర్పిస్తారు.
ఖర్చు చేయడం కన్నా పొదుపు చేయడంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.
మార్వాడీలు ఏదైనా వస్తువు కొంటే ధర తగ్గించేందుకు భేరమడడం అలవాటు చేసుకుంటారు. ఇది తమ వ్యాపారాల్లో పెట్టుబడిని తగ్గించి లాభాలకు కారణం అవుతుంది.
వ్యాపారంలోని ప్రమాదాలను స్వీకరించి అందుకు అనుగుణంగా ముందుకుసాగేలా సానుకూలతను అలవర్చుకుంటారు.
నగదు ప్రవాహంపై ఫోకస్
అధిక రుణాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం కంటే సొంత నిధులతో బిజినెస్ నడిపిస్తారు.
లాభాలను తిరిగి వ్యాపారంలోకే మళ్లిస్తారు.
నగదు ప్రవాహంపైనే ప్రధానంగా దృష్టి పెడుతారు.
బిజినెస్ మోడల్స్
వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
ఎక్కువ రిస్క్ ఉన్న వ్యాపారాల జోలికి వెళ్లరు.
దశల వారీగా పెరిగే అవకాశాలున్న వ్యాపారాలనే ఎంచుకుంటారు.
కమ్యూనిటీ నెట్‌వర్క్
నమ్మకంతో బిజినెస్ సంబంధాలను పెంపొందించుకుంటారు.
అప్పు, పెట్టుబడి, మార్కెట్ యాక్సెస్ కోసం సామాజిక సంబంధాలను ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగించుకుంటారు.
తరతరాల సంపద నిర్మాణం
వ్యాపార వారసత్వాన్ని జాగ్రత్తగా, ప్రణాళికబద్ధంగా ఉండేలా చూసుకుంటారు.
ఆస్తులను, తమ పెట్టుబడులను విభిన్న రంగాలకు విస్తరిస్తారు. రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్లు వంటి వాటిలో పెట్టుబడి పెడుతారు.
ఇదీ చదవండి: అమెజాన్ కొత్తగా మరో 40 ఆశ్రయ్ కేంద్రాలు