వచ్చేస్తోంది.. స్కోడా ఒక్టావియా

New Gen Skoda Octavia Is Ready To Launch In India  - Sakshi

మార్కెట్‌లోకి ఒక్టావియా ఫోర్త్‌ జనరేషన్‌ కారు

జూన్‌ 10న కొత్త మోడల్‌ రిలీజ్‌ చేయనున్న స్కోడా

వెబ్‌డెస్క్‌: క్వాలిటీ, లగ్జరీ, డ్యూరబులిటీలకు మరో పేరైన స్కోడా నుంచి మరో కొత్త కారు మార్కెట్‌లోకి వస్తుంది. ఎంట్రీ లెవల్‌ లగ్జరీ సెడాన్‌గా విజయవంతమైన ఒక్టావియా ఫోర్త్‌ జనరేషన్‌ కారు లాంఛింగ్‌కి రెడీ అయ్యింది స్కోడా

జూన్‌ 10న
కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో వ్యక్తిగత వాహనాలకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం కార్ల అమ్మకాల్లో జోరు తగ్గినప్పటికీ... కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ ఫుల్‌ మోడల్‌ ఒక్టావియాలో ఫోర్త్‌ జనరేషన్‌ కారును మార్కెట్లోకి తెస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమైతే మేలోనే ఈ కారు మార్కెట్‌లోకి రావాల్సింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా జూన్‌ 10కి వాయిదా పడింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న స్కోడా యూనిట్‌లో ఈ కార్లు తయారవుతున్నాయి.

ఓన్లీ పెట్రోల్‌ వెర్షన్‌
స్కోడా ఒక్టావియా ఫోర్త్‌ జనరేషన్‌ ఓన్లీ పెట్రోల్‌ వెర్షన్‌లోనే లభిస్తోంది.  ఈ కారులో అమర్చిన 2 లీటర్‌ యూనిట్‌ పెట్రోల్‌ ఇంజన్‌ 188 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. పాత కారుతో పోల్చితే సైజ్‌లో కొంచెం పెద్దదిగా డిజైన్‌ చేశారు. పొడవులో 19 మిల్లీమీటర్లు, వెడల్పులో 15 మిల్లీమీటర్లు పెద్దదిగా ఉంటుంది. కారు ముందు భాగంలో ఆప్షనల్‌ మ్యాట్రిక్స్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, హారిజంటల్‌ ఫాగ్‌ల్యాంప్స్‌ ఇవ్వగా వెనుక వైపు టైల్‌ల్యాంప్‌ డిజైన్‌లోనూ మార్పులు చేశారు. స్కోడా మార్క్‌ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. ఒక్టావియా మోడల్‌ మార్కెట్‌కి వచ్చి 20 ఏళ్లు దాటగా ఇప్పటి వరకు లక్షకు పైగా కార్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top