అంబానీ కొత్త విమానం.. ధర తెలిస్తే అవాక్కవుతారు! | Mukesh Ambani New Boeing 737 Max 9 | Sakshi
Sakshi News home page

అంబానీ కొత్త విమానం.. ధర తెలిస్తే అవాక్కవుతారు!

Sep 20 2024 9:17 PM | Updated on Sep 20 2024 9:24 PM

Mukesh Ambani New Boeing 737 Max 9

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ.. 'బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం' కొనుగోలు చేశారు. ఈ అల్ట్రా-లాంగ్-రేంజ్ బిజినెస్ ఫ్లైట్ విలువ సుమారు రూ.1,000 కోట్లు. ఇప్పటి వరకు మనదేశంలో ఏ వ్యాపారవేత్త కూడా ఇంత ఖరీదైన ఫ్లైట్ కొనుగోలు చేయలేదని సమాచారం.

ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధీనంలో తొమ్మిది ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అయితే అంబానీ కొనుగోలు చేసిన ఈ బోయింగ్ 737 మ్యాక్స్ 9 ఫ్లైట్ అనేక మార్పులను పొందినట్లు సమాచారం. ఈ కారణంగానే దీని ధర చాలా ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విమానం ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రిలయన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైకి చేరనుంది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు.. వీటికే ఎక్కువ డిమాండ్

బోయింగ్ 737 మ్యాక్స్ 9 స్పెసిఫికేషన్స్
బోయింగ్ 737 మ్యాక్స్ 9 రెండు CFMI LEAP-1B ఇంజిన్‌లను పొందుతుంది. ఈ విమానం ఒకసారికి 11,770 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. దీనిని పూర్తిగా స్విట్జర్లాండ్‌లో అనుకూలీకరించి ఇండియాకు తీసుకురావడం జరిగింది. ఇది విలాసవంతమైన ఫీచర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement