జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, ఏప్రిల్ 01, 2026 నుంచి తమ ఉత్పత్తుల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. నిరంతరం పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను అధికారికంగా భర్తీ చేయడానికే ఈ ధరల పెంపు అని కంపెనీ వెల్లడించింది.
ధరల పెరుగుదల తరువాత.. కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, విండ్సర్ ఈవీ రేట్లు పెరగనున్నాయి. అయితే ఎంజీ ఎం9 ప్రెసిడెన్షియల్ లిమో, ఎంజీ సైబర్‌స్టర్ ధరలు పెరగవు అని కంపెనీ వెల్లడించింది. కొత్త ధరలను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని ఎంజీ డీలర్‌షిప్‌ను లేదా అధికారిక ఎంజీ వెబ్‌సైట్‌ను సందర్శించమని కంపెనీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. భారతదేశపు మొట్టమొదటి D+ సెగ్మెంట్ SUVగా నిలవనున్న, రాబోయే మెజెస్టర్ కోసం కంపెనీ బ్రాండ్ ఒక బండిల్డ్ ఓనర్‌షిప్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 5-5-5 ప్రోగ్రామ్ పేరుతో.. వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, సర్వీస్ ప్రయోజనాలను ఒకే ఆఫర్‌గా కలపడం ద్వారా దీర్ఘకాలిక యాజమాన్య ఆందోళనలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.


