తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!

Maruti grand vitara has over 90000 pending orders - Sakshi

భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధరలు అధికారికంగా ప్రకటించక ముందే భారీ సంఖ్యలో బుకింగ్స్ పొందిన గ్రాండ్ విటారా ఇప్పటికీ 90,000 కంటే ఎక్కువ బుకింగ్స్‌ కైవసం చేసుకుంది. దీంతో డెలివరీ పీరియడ్ భారీగా పెరిగింది.

మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 19.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. ఇది మొత్తం 9 కలర్ ఆప్సన్స్‌లో (ఆరు మోనోటోన్ & మూడు డ్యూయల్ టోన్‌) లభిస్తుంది.

గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 103 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

(ఇదీ చదవండి: Kissing Device: దూరంగా ఉన్నా కిస్ చేసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా?)

ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ 92 హెచ్‌పి పవర్, 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్, 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీద ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తూ, 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు 28 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

మారుతి సుజుకి ఇప్పటికే గ్రాండ్ విటారా డెలివరీలను ప్రారంభించింది, ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ SUV ని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కారు మరిన్ని ఎక్కువ పొందే అవకాశం కూడా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top