రంకెలేసిన బుల్‌: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు | Market HIGHLIGHTS: Sensex ends above 50,100, Nifty near 14,850 | Sakshi
Sakshi News home page

రంకెలేసిన బుల్‌: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Mar 30 2021 4:39 PM | Updated on Mar 30 2021 4:43 PM

Market HIGHLIGHTS: Sensex ends above 50,100, Nifty near 14,850 - Sakshi

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి. లాంగ్‌ వీకెండ్‌ తరువాత స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా మొదలయ్యాయి. మూడు రోజుల విరామం తరువాత, గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మంగళవారం కీలక సూచీలు లాభాల కొనసాగాయి. మొత్తంగా నేడు మార్కెట్లు రెండు శాతానికి పైగా ఎగిశాయి. ఆరంభ లాభాల నుంచి మరింత దూసుకపోతున్న సెన్సెక్స్‌ 1128 పాయింట్ల లాభంతో 50,136 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఉదయం 14,628 పాయింట్ల వద్ద ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ 337 పాయింట్లు ఎగబాకి 14,845 వద్ద స్థిరపడింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.36 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ 30 సూచీలో మూడు తప్ప మిగతా కంపెనీలన్నీ లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్, ఎన్‌టీపీసీ షేర్లు మూడు శాతానికి పైగా ఎగిశాయి. ఇక నిఫ్టీలో ఒక్క స్థిరాస్తి మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి.

చదవండి:

ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement