టెకీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ : డ‌బుల్ హైక్స్ కు ఐటీ దిగ్గ‌జాల మొగ్గు

Infosys, TCS, Cognizant give double hikes as competition for talent intensifies - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి కారణంగా గత ఏడాది చాలా ఐటి కంపెనీలు జీతాల పెంపును వాయిదా వేసుకున్నాయి. గత ఏడాది రెండవ భాగంలో వ్యాపారం పుంజుకున్నందున, చాలా ఐటి కంపెనీలు గత క్యాలెండర్ సంవత్సరం చివరి నుంచి లేదా ఈ ఏడాది ఆరంభం నుంచి ఇంక్రిమెంట్ ఇవ్వడం ప్రారంభించాయి. ఇక ఈ ఏడాది ఐటీ దిగ్గ‌జాలు ఇప్ప‌టికే వేత‌నాలు పెంచడంతో పాటు నైపుణ్యం గల మాన‌వ వ‌న‌రుల‌ను నిలుపుకునేందుకు డ‌బుల్ హైక్స్ కూడా ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. కరోనా మహమ్మారి డిజిటల్ వాడకం పెరగడంతో పాటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండటంతో ఆఫీస్ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గి పోయాయి. అందుకే ప్రతిభ గల ఉద్యోగులు జారీ పోకుండా ఉండేందుకు డ‌బుల్ హైక్స్ ఇచ్చేందుకు సిద్దపడుతున్నాయి. దీంతో టెకీల్లో జోరు నెల‌కొంది.

ఇప్పుడు ప్రతిభకు పోటీ తీవ్రతరం కావడంతో, చాలా ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్లతో మళ్లీ బహుమతి ఇస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, 2 లక్షలకు పైగా ఉద్యోగులున్న యాక్సెంచర్ ఇండియా గత ఏడాదికి డిసెంబరులో ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ వేతనాల పెంపు, బోనస్, ప్రమోషన్లను ప్రకటించింది. ఏప్రిల్‌లో అసోసియేట్ డైరెక్ట‌ర్ స్థాయి వ‌ర‌కూ ఒన్ టైమ్ థ్యాంక్యూ బోన‌స్ ను అంద‌చేశామని యాక్సెంచ‌ర్ ఇండియా ప్ర‌క‌టించిన‌ట్టు ఓ జాతీయ‌ వార్తా సంస్థ వెల్ల‌డించింది. మ‌రోవైపు ఈ ఏడాది రెండోసారి కాంపెన్సేష‌న్ రివ్యూ జ‌రుగుతోంద‌ని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచ‌ర్డ్ లోబో వెల్ల‌డించారు. గత ఏడాది డిసెంబరులో, యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 605 మందిని ఎండికి, 63 మందిని సీనియర్ ఎండికి ప్రమోషన్ ఇచ్చింది. ఇందులో రికార్డు శాతం మహిళలు ఉన్నారు.

మ‌రోవైపు ఈ ఏడాది రెండోసారి కాంపెన్సేష‌న్ రివ్యూ జ‌రుగుతోంద‌ని ఇన్ఫోసిస్ ఈవీపీ & హెచ్ఆర్ హెడ్ రిచ‌ర్డ్ లోబో వెల్ల‌డించారు. గత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు హైక్స్ నిలిపివేసిన తరువాత జనవరి నుంచి ఇంక్రిమెంట్లను ఇవ్వడం ప్రారంభించారు. గత సంవత్సరం పనితీరు ఆధారంగా మరో సమీక్ష ఇన్ఫోసిస్ చేస్తున్నట్లు పేర్కొంది. పనితీరు ఆధారంగా జీతం పెంపు జూలై నుంచి అమలులోకి రానుంది. రెండు ఇంక్రిమెంట్లు క‌లుపుకుని 10 నుంచి 14 శాతం వ‌ర‌కూ వేత‌న పెంపు ఉంటుంద‌ని భావిస్తున్నారు.

అలాగే, ఇన్ఫోసిస్ ప్రధాన ప్రత్యర్థి టీసీఎస్ ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు ఇంక్రిమెంట్ల‌ను ఇచ్చినట్లు ప్రకటించింది. టీసీఎస్ అన్ని భౌగోళిక ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్ ఇచ్చింది. చాలా మంది సీనియర్ ఉద్యోగులు 6-8 శాతం వరకు వేత‌న పెంపును అందుకున్నారని, ఇది సాధారణం కంటే ఎక్కువగా అని మార్కెట్ వర్గాల అభిప్రాయం. ఇక విప్రో మ‌రో దేశీ ఐటీ దిగ్గజం విప్రో జూన్ లో వేత‌న పెంపును అమ‌లు చేస్తామ‌ని వెల్ల‌డించింది. ఏప్రిల్ నుంచి తమ సిబ్బంది వేత‌నాలు పెంచిన‌ట్టు టెక్ మ‌హీంద్ర పేర్కొంది.

చదవండి:

భారత్ కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top