ఇన్ఫీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా స్వైటెక్‌ | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా స్వైటెక్‌

Published Sat, Aug 26 2023 6:04 AM

Infosys onboards tennis player Iga Swiatek as global brand ambassador - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంతర్జాతీయ మహిళా టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వైటెక్‌ను నియమించుకుంది. కొన్నేళ్ల పాటు అమల్లో ఉండే ఈ భాగస్వామ్యం ద్వారా సంస్థ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ను ప్రమోట్‌ చేయడంతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినివ్వనుంది. అంతేకాకుండా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌(ఎస్‌టీఈఎం–స్టెమ్‌)లలో వెనుకబడిన మహిళల కోసం ప్రోగ్రామ్‌లను సృష్టించనున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలియజేసింది.

మహిళా సాధకులపై స్వైటెక్‌ అత్యంత ప్రభావశీలిగా నిలుస్తుందని ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వైటెక్‌తో కలిసి ఇన్ఫోసిస్‌ యువతకు ప్రధానంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌కు కీలకమైన స్టెమ్‌లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేవిధంగా ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించారు. 22ఏళ్ల స్వైటెక్‌ నాలుగుసార్లు గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లను సొంతం చేసుకోవడంతోపాటు.. 2022 ఏప్రిల్‌ నుంచి ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా నిలుస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలియజేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement