గగన్‌యాన్ మిషన్ మరింత ఆలస్యం 

Indias Human Space Flight Mission Likely To Be Delayed By One Year Due To COVID 19 - Sakshi

సాక్షి, బెంగళూరు: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి ఆర్బిటల్ వ్యోమనౌకలో భారతీయ వ్యోమగాములను పంపనుంది. ఇండియన్ హ్యుమన్ స్పెస్ క్రాఫ్ట్ ప్రొగ్రామ్‌లో భాగంగా 2022 నాటికి భారతీయ వ్యోమగాములతో కూడిన ఆర్బిల్ స్పేస్ క్రాఫ్ట్‌‌ను కనీసం 7 రోజులు అంతరిక్షానికి పంపించడమే గగన్ యాన్ ప్రయోగం ఉద్దేశమని ఇస్రో తెలిపింది. తాజాగా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష మిషన్ గగన్‌యాన్ ఒక సంవత్సరం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారులు తెలిపారు.(చదవండి: దేశీయంగా వ్యాక్సిన్‌కు అనుమతించండి)

రెండు మానవ రహిత మిషన్లను డిసెంబర్ 2020, జూలై 2021లో నిర్వహిస్తామని... వ్యోమగాములతో కూడిన మిషన్ ను డిసెంబర్ 2021లో నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. గగన్‌యాన్ మిషన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లో భాగంగా ప్రాజెక్ట్ కోసం ఎంపికైన మనుషులకి ఈ మిషన్ ప్రయోగానికి ముందు రెండు అన్‌క్రూవ్డ్ మిషన్లు చేపడుతారు. కానీ "కోవిడ్ కారణంగా ఈ మిషన్ మరింత ఆలస్యం అవుతుంది" అని ఇస్రో చైర్మన్ కె.శివన్ స్పష్టం చేశారు. "మేము వచ్చే ఏడాది చివరలో లేదా తర్వాతి సంవత్సరంలో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అతను తెలిపారు. గగన్‌యాన్ మిషన్ లో భాగంగా ముగ్గురు సిబ్బందితో కూడిన వ్యోమనౌకని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (LEO)కు కక్ష్యలో ప్రవేశపెట్టడంతో పాటు, మిషన్ తరువాత వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం గగన్ యాన్ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. బెంగళూరు ప్రధాన కార్యాలయం ఇస్రో గత నెలలో హెవీ లిఫ్ట్ లాంచర్, జిఎస్ఎల్వి ఎంకెఐఐఐని గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రయోగించినట్లు తెలిపారు. జిఎస్ఎల్వి ఎంకెఐఐఐలో హై థ్రస్ట్ సాలిడ్ ప్రొపెల్లెంట్ స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ S200 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top