Weekly Salary: Indiamart To Move To Weekly Payout Of Salaries In India - Sakshi
Sakshi News home page

Weekly Salary: గుడ్‌న్యూస్‌,ఇక‌పై వారానికి ఒక‌సారి శాల‌రీ!! భార‌త్‌లో మొద‌లైన కొత్త క‌ల్చ‌ర్!

Feb 6 2022 1:53 PM | Updated on Feb 6 2022 2:56 PM

India Mart To Move To Weekly Payout Of Salaries In India - Sakshi

ప్ర‌పంచ దేశాల్లో కోవిడ్ కార‌ణంగా ఉద్యోగుల వ‌ర్క్ క‌ల్చ‌ర్ పూర్తిగా మారిపోయింది.  ఇప్పుడు వ‌ర్క్ క‌ల్చ‌ర్‌తో పాటు ఉద్యోగుల చెల్లించే నెల‌వారీ జీతాల విధానం పూర్తిగా మారిపోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కు ఒక సారి మాత్ర‌మే సంస్థ‌లు ఉద్యోగుల‌కు జీతాల్ని చెల్లిస్తుండేవి. కానీ ఇప్పుడు ఆ విధానానికి స్వ‌స్తి ప‌లికి వారానికి జీతాలు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నాయి.  

అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి దేశాల్లో సంస్థ‌లు ఉద్యోగుల‌కు వారం వారం జీతాల్ని చెల్లిస్తుంటాయి. ఇప్పుడు ఈ క‌ల్చ‌ర్ ఇండియాలో మొద‌లైంది.  దేశీయ బీ2బీ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ సంస్థ ఇండియా మార్ట్ ఉద్యోగులకు నెల‌వారీ కాకుండా వారం వారం జీతాల్ని చెల్లించాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్ర‌క‌టించింది. వారానికి ఒక‌సారి జీతాలు చెల్లించ‌డం ద్వారా ఉద్యోగులకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు త‌లెత్త‌వ‌ని, త‌ద్వారా వ‌ర్క్ ప్రొడ‌క్టివిటీ పెరుగుతుంద‌ని ఇండియా మార్ట్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది.  

కాగా,డిసెంబర్ 2021 త్రైమాసికంలో ఇండియామార్ట్ ఏకీకృత నికర లాభంలో 12.4 శాతం క్షీణించి రూ.70.2 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.80.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఎఫ్‌వై22 3వ త్రైమాసికంలో దీని ఆదాయం రూ.173.6 కోట్ల నుంచి 8.3 శాతం పెరిగి రూ.188.1 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement