5.62 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు!

India exports 5. 62 lakh tonne of sugar till December - Sakshi

డిసెంబర్‌ 6వరకూ గణాంకాలు విడుదల చేసిన ఏఐఎస్‌టీఏ  

న్యూఢిల్లీ: భారత్‌ అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రస్తుత 2022–23 మార్కెటింగ్‌ సంవత్సరంలో డిసెంబర్‌ 6వ తేదీ వరకూ 5.62 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసిందని వాణిజ్య వేదిక– ఏఐఎస్‌టీఏ (ఆల్‌ ఇండియా షుగర్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌) మంగళవారం తెలిపింది. ప్రస్తుత (2022–23) మార్కెటింగ్‌ సంవత్సరంలో (అక్టోబర్‌–సెప్టెంబర్‌) 60 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి నవంబర్‌లో ప్రభుత్వం అనుమతించింది.

ఏఐఎస్‌టీఏ లెక్కల ప్రకారం, చక్కెర మిల్లుల నుండి ఎగుమతుల కోసం పంపిన పరిమాణం 12.19 లక్షల టన్నులు. దీనిలో భౌతిక రవాణా ప్రస్తుత మార్కెటింగ్‌ సంవత్సరం డిసెంబర్‌ 9 వరకు 5.62 లక్షల టన్నులు. యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ)కి  గరిష్టంగా చక్కెర ఎగుమతయ్యింది.  ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇండోనేషియా, సోమాలియా, ఇతర దేశాలకు ఎగుమతులు జరిగాయి.  దాదాపు 5.22 లక్షల టన్నుల చక్కెర లోడింగ్‌ లేదా లోడింగ్‌ కోసం సిద్ధంగా ఉంది. 2021–22 మార్కెటింగ్‌ సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 111 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top