ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌ జోరు: అదరగొట్టిన శాంసంగ్‌ 

India 5G tablet shipments grow 61pc Samsung leads - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌ అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్‌లో 22 శాతం వృద్ధి చెందింది. 5జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్‌ నేపథ్యంలో ఈ స్థాయి వృద్ధి నమోదైందని సైబర్‌మీడియా రిసర్చ్‌ తెలిపింది.(Vu GloLED TV: క్రికెట్‌, సినిమా మోడ్‌తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!)

‘సెప్టెంబర్‌ త్రైమాసికంలో శాంసంగ్‌ 28 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. లెనోవో 26, యాపిల్‌ 19 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం విక్రయాల్లో 8 అంగుళాల శ్రేణి మోడళ్ల వాటా ఏకంగా 43 శాతముంది. శామ్‌సంగ్‌ అమ్మకాలు 83 శాతం, యాపిల్‌ ఐప్యాడ్‌ 26 శాతం దూసుకెళ్లాయి. ట్యాబ్లెట్‌ పీసీ విపణి 2022లో 10-15 శాతం వృద్ధి సాధిస్తుంది’ అని సీఎంఆర్‌ వివరించింది.  (భారత్‌ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top