Hyundai India Announces Discounts of Up to Rs 50000 in February 2022 - Sakshi
Sakshi News home page

కార్ల కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌!!

Feb 20 2022 5:18 PM | Updated on Feb 20 2022 6:43 PM

Hyundai India Announces Discounts Of Up To Rs 50000 In February 2022 - Sakshi

ప్ర‌ముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ కొనుగోలు దారుల‌కు బంప‌రాఫ‌ర్లు ప్ర‌క‌టించింది. హ్యుందాయ్ ఇండియా ఫిబ్ర‌వ‌రి నెల వ‌ర‌కు ఐ20, గ్రాండ్ఐ10 నియోస్‌, ఆరా,శాంత్రోపై  డిస్కౌంట్‌తో పాటు  ఎక్ఛేంజ్ బోన‌స్‌, కార్పొరేట్ డిస్కౌంట్‌లు ఉన్నాయి.  

హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లను రూ.40,000 విలువైన తగ్గింపుతో అందిస్తుంది. ఐ20 అనేక‌ రకాలైన ఇంజన్, గేర్‌బాక్స్ కాంబినేషన్‌లో అందించబడుతోంది. దీని ధరలు రూ. 6.98 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్). 

ఈ నెలలో శాంత్రో కారుపై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.  కేవలం పెట్రోల్ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. సీఎన్‌జీ వెర్షన్‌లకు ఎలాంటి ఆఫ‌ర్ల‌ను లేవ‌ని హ్యుందాయ్ తెలిపింది.  

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా వెహిక‌ల్స్‌పై రూ.50వేల డిస్కౌంట్ అందిస్తున్న‌ట్లు తెలిపింది. వీటిలో సంబంధిత మోడళ్ల సీఎన్‌జీ వెర్షన్లు మినహా పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై ఆఫ‌ర్లు ఉన్న‌ట్లు ఆ కంపెనీ నిర్వాహ‌కులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement