టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్‌ 

Huge Discounts On Tata Nexon EV - Sakshi

రూ.1.2 లక్షల వరకు తగ్గింపు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అయిన నెక్సన్‌.ఈవీ, టియాగో.ఈవీ మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. బ్యాటరీ వ్యయాలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. నెక్సన్‌.ఈవీ ధర రూ.1.2 లక్షల వరకు తగ్గింది. దీంతో ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ.14.49 లక్షలు ఉంది.

టియాగో.ఈవీ ధర రూ.70,000 వరకు తగ్గడంతో ఈ మోడల్‌ రూ.7.99 లక్షల నుంచి లభిస్తోంది. బ్యాటరీ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని పంచ్‌.ఈవీ ధర నిర్ణయించడంతో తాజాగా ఎటువంటి సవరణ చేయలేదని టాటా మోటార్స్‌ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్‌ వాహన పరిశ్రమ 8 శాతం వృద్ధి చెందింది. అయితే ఈవీ విభాగం 90 శాతం దూసుకెళ్లడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే 2024 జనవరిలో ఈవీ విభాగం ఏకంగా 100%పెరగడం విశేషం. ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ కార్ల పరిశ్రమలో భారత్‌లో 70%పైగా వాటాతో టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అగ్రస్థానంలో నిలిచింది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top