తప్పుచేస్తే.. దాని ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమీ చేయకపోయినా, కొన్ని సార్లు నష్టాలు చవిచూడాల్సి వస్తుందంటున్నారు.. చార్టర్డ్ అకౌంటెంట్ 'నితిన్ కౌశిక్'. ఇంతకీ ఇదెలా సాధ్యమవుతుందనే.. విషయాన్ని ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
డబ్బు కోల్పోవడానికి నిజమైన కారణం మార్కెట్ పతనం మాత్రమే కాదు. ద్రవ్యోల్బణం వల్ల నష్టాలను చూడాల్సి వస్తుందని నితిన్ కౌశిక్ తన ఎక్స్ ఖాతాలో వివరించారు.
రియల్ ఎస్టేట్ రంగంలో బాగా అనుభవం ఉన్న.. నా స్నేహితుడు గుర్గావ్‌లోని తన ఆస్తిని రూ. 14 కోట్లకు విక్రయించాడు. అయితే.. ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం కోసం వేచి చూసాడు. రోజులు గడుస్తున్నా.. సమయం కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. కోవిడ్ సమయంలో పరిస్థితులు మారిపోయాయి. రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉండిపోయాయి. బాండ్లు కూడా అంతంత మాత్రంగానే అనిపించాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్ చేస్తే నష్టం వస్తుందేమో అనే భయంతో డబ్బును ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదు.
The Real Wealth Killer Nobody Talks About
Your biggest enemy in wealth creation isn’t a market crash.
It’s inaction. 🧵👇🏼#stockmarket #investingtips #finance #realestate pic.twitter.com/HYx8WBTxLS— CA Nitin Kaushik (FCA) | LLB (@Finance_Bareek) October 23, 2025
చార్టర్డ్ అకౌంటెంట్ లెక్కల ప్రకారం..
డబ్బును ఎక్కడా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల.. కౌశిక్ లెక్కల ప్రకారం, నెలకు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల మధ్య లాభాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ లెక్కన ఏడాదికి రూ. 45 లక్షలు కోల్పోవాల్సి వస్తుంది. కాగా ఇప్పటికే తాను అమ్మిన ఆస్తి విలువ కూడా రూ. 1.2 కోట్లు పెరిగింది.
నా స్నేహితుడు.. తన దగ్గర ఉన్న డబ్బును ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి ఉన్నా, తనకు లాభాలు వచ్చేవి. కానీ డబ్బును స్థిరంగా ఉంచడం వల్ల, డబ్బు విలువ తగ్గలేదు. కానీ ద్రవ్యోల్బణంలో భారీ మార్పులు వచ్చాయి. తాను అమ్మిన ఆస్తిని కొనాలంటేనే.. ఇంకో రూ. 1.2 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
డబ్బును కేవలం ఒకచోట కాకుండా.. వివిధ ఆస్తులలో పెట్టుబడిగా పెడితే రిస్క్ తగ్గుతుంది. అంటే ఒక దగ్గర కొంత నష్టం వచ్చినా.. ఇంకో దగ్గర లాభం వస్తుంది. కాబట్టి డబ్బును ఒకే దగ్గర ఉంచడం వల్ల లాభాలను గడించలేరు. మొత్తం మీద.. సింపుల్‌గా చెప్పాలంటే, సరైన సమయం కోసం వెయిట్ చేయడం కంటే.. చిన్నగా ఇన్వెస్ట్ చేయడం మంచిదని స్పష్టమవుతోంది.


