HCL Technologies: అరుదైన ఫీట్‌ను సాధించిన హెచ్‌సీఎల్‌..!

HCL Technologies Crosses 50 Billion Dollors In Market Cap - Sakshi

భారత టెక్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు సెప్టెంబర్‌ 24న మార్కెట్‌ క్యాప్‌ 50 బిలియన్‌  డాలర్ల మార్క్‌ను దాటింది. శుక్రవారం బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ రూ. 3,68,420 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను హెచ్‌సీఎల్‌ నమోదు చేసింది.సెప్టెంబర్ 24 న హెచ్‌సీఎల్‌ కంపెనీ షేర్లు రూ .1,359.75 వద్ద ట్రేడయ్యాయి. అమెరికాకు చెందిన ఎమ్‌కెఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో కంపెనీ ఐదు సంవత్సరాల ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత గత 5 రోజుల్లో దాదాపు 7 శాతం మేర హెచ్‌సీఎల్‌ షేర్లు పెరిగాయి. 
చదవండి: ప్యాన్‌కేక్‌ .. ఆ రుచి వెనుక కష్టాల కథ

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ విభాగంలో మెరుగైన పనితీరు, అధిక ఉత్పాదకత కోసం ఎమ్‌కేఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో హెచ్‌సీఎల్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హెచ్‌సీఎల్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 50 బిలియన్‌ డాలర్లకు చేరిందని మాజీ సీఈఓ వినీత్ నాయర్ ఈరోజు ట్విటర్‌లో వెల్లడించారు. ఈ అసాధారణ ఫీట్‌ను అందించినందుకు ఉద్యోగులకు, మేనెంజ్‌మెంట్‌ టీమ్‌కు ధన్యవాదాలను తెలియజేశారు. కంపెనీ తదుపరి లక్ష్యం 100 బిలియన్‌ డాలర్లని పేర్కొన్నారు. 
చదవండి: Knight Frank Luxury Investment Index: లగ్జరీ ఉత్పత్తుల్లో వీటిపై అధిక లాభాలు...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top