పసిడి ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న పర్వదినం అక్షయ తృతీయ (Akshaya Tritiya) వచ్చేసింది. నేడు వారంతపు సెలవు కావడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ట్రేడింగ్ ఉండదు. దీంతో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల్లో (ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 వరకు) బంగారం ధరలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఏప్రిల్ 13న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460 ఉండగా, అది ఏప్రిల్ 19 నాటికి రూ.1,55,780కి చేరుకోవడంతో మొత్తం రూ.3,320 మేర పెరిగింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏప్రిల్ 13న రూ.1,39,750 ఉండగా, ఏప్రిల్ 19 నాటికి అది రూ.1,42,800కి చేరుకొని వారం రోజుల్లో మొత్తంగా రూ.3,050 మేర పెరుగుదలను నమోదు చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..





(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


