బంగారం, వెండి తగ్గిందా.. పెరిగిందా? నేటి ధరలు ఇలా.. | Today Gold and Silver Price Today 14 June 2024 | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి తగ్గిందా.. పెరిగిందా? నేటి ధరలు ఇలా..

Jun 23 2024 11:00 AM | Updated on Jun 23 2024 11:25 AM

Today Gold and Silver Price Today 14 June 2024

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. క్రితం రోజున రూ.800 మేర తగ్గిన పసిడి ధరలు ఈరోజు (జూన్‌ 23) స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మళ్లీ పెరగక ముందే బంగారం కొనాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.66,350 లగా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా ఉంది.

ఇతర నగరాల్లో.. 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.73,400 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,350, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,350 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 వద్ద కొనుసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.66,950 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.73,970 లుగా ఉంది.

వెండి రేటు ఇలా..
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరల్లో కూడా ఈరోజు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement
 
Advertisement
Advertisement