తగ్గిన పసిడి,వెండి | Gold prices retreated by Rs 2640 to Rs 1. 47 lakh per 10 grams | Sakshi
Sakshi News home page

తగ్గిన పసిడి,వెండి

Jul 29 2026 4:11 AM | Updated on Jul 29 2026 4:11 AM

Gold prices retreated by Rs 2640 to Rs 1. 47 lakh per 10 grams

బంగారం రూ. 2,640 డౌన్‌ 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్‌ నెలకొనడంతో దేశీయంగా పసిడి ధరలు తగ్గాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,640 తగ్గి రూ. 1,47,000కు దిగి వచ్చింది. అటు వెండి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. కేజీకి రూ. 5,200 తగ్గి రూ. 2,24,800కి పరిమితమైంది.

రూపాయి బలపడటంతో దిగుమతి చేసుకున్న బులియన్‌ వ్యయం తగ్గిందని, అలాగే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయంపై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని, దీనితో పసిడి ధర నెమ్మదించిందని ట్రేడర్లు తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 1.31 శాతం తగ్గి 4,023.50 డాలర్లకు, వెండి 2 శాతం క్షీణించి 57.24 డాలర్లకు నెమ్మదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement