
భారతదేశంలో ఎక్కువమంది జరుపుకునే పండుగలలో.. దీపావళి ఒకటి. ఈ ఫెస్టివల్ సమయంలో అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు.. బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నాయి. ఈ కథనంలో ఈ సెలవులకు సంబంధించిన మరిన్ని వివరాలు చూసేద్దాం.
➤అక్టోబర్ 19, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు).
➤అక్టోబర్ 20, సోమవారం: దీపావళి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు).
➤అక్టోబర్ 21, మంగళవారం: గోవర్ధన్ పూజ / లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మణిపూర్, జమ్మూ, శ్రీనగర్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు).
➤అక్టోబర్ 22, బుధవారం: బలిపాడ్యమి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, సిక్కింలోని బ్యాంకులకు సెలవు).
➤అక్టోబర్ 23, గురువారం: భాయ్‌దూజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ (అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, సిమ్లాలలో బ్యాంకులుకు సెలవు).
అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: దీపావళికి.. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్