
2025 ఆగస్టులో బ్యాంక్ సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం మీద 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ఇప్పటికే తెలుసుకున్నాం. కాగా ఈ వారంలోనే వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి.
ఆగస్టు 13 (బుధవారం): దేశభక్తుల దినోత్సవం సందర్భంగా 'ఇంఫాల్' (మణిపూర్)లోని బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 15 (శుక్రవారం): స్వాతంత్య్ర దినోత్సవం, పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 16 (శనివారం): జన్మాష్టమి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులు మూతపడి ఉంటాయి.
ఆగస్టు 17 (ఆదివారం): ఆదివారం కాబట్టి.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.