ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి | Every India Child Must Read This Book Says Infosys Narayana Murthy | Sakshi
Sakshi News home page

ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

May 17 2024 7:47 PM | Updated on May 17 2024 8:02 PM

Every India Child Must Read This Book Says Infosys Narayana Murthy

"మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్‌నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.

'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement