ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రిని కలిసిన ఎలాన్‌ మస్క్‌! | Elon Musk Meets Father For First Time In 7 Years | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రిని కలిసిన ఎలాన్‌ మస్క్‌!

Nov 24 2023 1:57 PM | Updated on Nov 24 2023 2:59 PM

Elon Musk Meets Father For First Time In 7 Years - Sakshi

స్పేస్‌ఎక్స్‌ అధినేత, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఏడేళ్ల తర్వాత తన తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గరుయ్యారంటూ పలు నివేదకలు వెలుగులోకి వచ్చాయి. 

మస్క్‌ గత వారం స్పేస్‌ఎక్స్‌కి చెందిన స్టార్‌షిప్‌ను లాంచ్‌ చేశారు. టెక్సాస్‌లోని బోకా చికాలో స్టార్ట్‌షిప్‌ ప్రారంభోత్సవానికి ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ హాజరయ్యారు. ఎర్రోల్‌ మస్క్‌తో పాటు తన మాజీ భార్య హైడ్, మనవరాలు కోరాను వెంటపెట్టుకుని వచ్చారు. 

2016లో చివరి సారిగా
ఎలాన్‌ మస్క్‌ తన తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ను చివరిసారిగా 2016లో కలుసుకున్నారు. తన తమ్ముడు కింబాల్‌ మస్క్‌తో కలిసి తండ్రి జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కలుసుకోవడం మస్క్‌ కుటుంబంలో పండుగ వాతావారం నెలకొందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.   

సంతోషం.. అస్సలు ఊహించలేదు
‘స్టార్‌షిప్‌ లాంచ్‌ కోసం ఎర్రోల్‌ మస్క్‌ని ఆహ్వానించడం ఆశ్చర్యానికి గురి చేసింది. కుటుంబం మొత్తం ఏడ్చేసింది. ఇది చాలా ఎమోషనల్. ఎర్రోల్ మస్క్‌ .. ఎలాన్‌ మస్క్‌ని చూసి చాలా సంతోషించాడు. ఎలాన్‌ మస్క్‌ తన తండ్రిని చూసి చాలా సంతోషంగా కనిపించారు’ అని ఎర్రోల్‌ మస్క్‌ మాజీ భార్య హెడీ చెప్పారు. భోజనం టేబుల్‌ వద్ద తండ్రి-కుమారులిద్దరూ కుర్చుని మాట్లాడుకున్నారు. సమయం తెలియలేదని గుర్తు చేసుకున్నారు.    

తండ్రంటే
ఎలాన్‌ మస్క్‌కు త‌న తండ్రి ఎర్రోల్ మ‌స్క్ అంటే అస్స‌లు న‌చ్చ‌దు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్‌గా ఉన్న ఎర్రోల్ అత్యంత క్రూరుడు. శారీర‌క సుఖ కోసం ఎంత‌కైనా తెగిస్తాడు. ఎర్రోల్  తొలిసారి ఎలాన్‌ మ‌స్క్ త‌ల్లి మేయ‌ల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ త‌రువాత మేయ‌ల్‌కు విడాకులిచ్చి అప్ప‌టికే పెళ్లై 10ఏళ్ల కూతురున్నహెడీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య కుమార్తె జానాకు ఎలాన్ మ‌స్క్ తండ్రి ఎర్రోల్ మ‌స్క్ వ‌య‌స్సు వ్య‌త్యాసం 40ఏళ్లు.  

స్పేస్‌ఎక్స్‌ ప్రయోగం ఫెయిల్‌
స్పేస్‌ఎక్స్‌ గత వారం లాంచ్‌ చేసిన ఈ స్టార్‌ షిప్‌ ఇప్పటి వరకు స్పేస్‌ ఎక్స్‌ తయారు చేసిన రాకెట్లలో ఇదే పెద్దది. స్టార్‌షిప్‌లోని రెండు దశలను కలిపితే, రాకెట్ 397 అడుగుల (121 మీటర్లు) పొడవు ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని 90 అడుగుల ఎత్తును అధిగమించింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్‌ రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్‌ పైభాగం బూస్టర్‌ నుంచి విజయవంతంగా వేరుపడింది.

అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్‌ షిప్‌ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్‌లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్‌ పేలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement