Elon Musk Announces Big Change Twitter Limit Data Scraping - Sakshi
Sakshi News home page

ట్విటర్‌ యూజర్లకు షాకిచ్చిన మస్క్‌.. ఇక రోజుకు అన్నే ట్వీట్లు..

Published Sun, Jul 2 2023 8:56 AM

Elon Musk Announces Big Change Twitter Limit Data Scraping - Sakshi

ట్విటర్‌ యూజర్లకు షాకిచ్చాడు దాని అధినేత ఎలాన్‌ మస్క్‌. ఇకపై రోజూ ఎన్నిపడితే అన్ని ట్వీట్‌లు చదవడానికి వీలు లేదు. పెరిగిపోయిన డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ స్థాయిని తగ్గించేందుకు యూజర్లు ట్వీట్‌లను చదవడంపై రోజువారీ పరిమితిని విధిస్తున్నట్లు మస్క్‌ తాజాగా పేర్కొన్నాడు.

ఇదీ పరిమితి..
వెరిఫైడ్‌ అకౌంట్‌ యూజర్లు రోజుకు 6,000 పోస్ట్‌లను మాత్రమే చదివేలా పరిమితి విధించారు. ఇక అన్‌వెరిఫైడ్‌ యూజర్లు 600 పోస్ట్‌లు, కొత్తగా చేరిన అన్‌వెరిఫైడ్‌ యూజర్లు 300 పోస్టులు  మాత్రమే చదివేలా తాత్కలికంగా పరిమితి విధిస్తున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు.

త్వరలో పరిమితి పెంపు
ప్రస్తుతం విధించిన తాత్కాలిక పరిమితిని త్వరలో పెంచనున్నట్లు కూడా మస్క్‌ ప్రత్యేక పోస్ట్‌లో పేర్కొన్నారు. వెరిఫైడ్‌ యూజర్లు రోజుకు 8,000 పోస్ట్‌లు, అన్‌ వెరిఫైడ్‌ యూజర్లు 800 పోస్ట్‌లు, నూతన అన్‌వెరిఫైడ్‌ యూజర్లు 400 పోస్ట్‌లు చదివేలా పరిమితిని పెంచుతామని వివరించారు. 

ట్వీట్‌లను వీక్షించాలంటే ట్విటర్‌ అకౌంట్‌ తప్పనిసరి అని ఆ సంస్థ ఇంతకుముందే ప్రకటించింది. ఈ చర్యను "తాత్కాలిక అత్యవసర చర్య" అని అభివర్ణించారు ఎలాన్‌ మస్క్‌. వందలాది సంస్థలు ట్విటర్ డేటాను అత్యంత దూకుడుగా ఉపయోగించుకుంటున్నాయని, ఇది వినియోగదారు అనుభవాన్ని ప్రభావితం చేస్తుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘ఆ మస్క్‌ను ఎవరైనా నిద్ర లేపండ్రా..’ ఆడేసుకున్న ట్విటర్‌ యూజర్లు 

Advertisement
Advertisement