దేశంలో ఈవీల జోరు: ఏకంగా 185 శాతం

electric vehicles gain momentum October records 185 pc surge in India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) రిటైల్‌  విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 2022 అక్టోబర్‌ నెలలో మొత్తం 1,11,971 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021 అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 185 శాతం అధికం కావడం విశేషం. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. గత నెలలో ప్యాసింజర్‌ ఈవీలు 178 శాతం ఎగసి 3,745 యూనిట్లు రోడ్డెక్కాయి. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు 19,826 యూనిట్ల నుంచి 269 శాతం వృద్ధితో 73,169 యూనిట్లకు చేరాయి. ఈ-త్రీ వీలర్లు 93 శాతం దూసుకెళ్లి 34,793 యూనిట్లను తాకాయి. ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాలు 125 శాతం పెరిగి 274 యూనిట్లు అమ్ముడయ్యాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top