గ్రామీణ ఆర్థిక వ్యవస్థే ఆశాకిరణం

Economy on recovery path piggy-riding rural rebound - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌

ముంబై: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దన్నుతో కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న అంచనాను హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ వ్యక్తం చేశారు. అంచనాల కంటే ముందే దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుందన్నారు. లాక్‌డౌన్‌ చర్యలను జూలై ఆఖరుకు పూర్తిగా ఎత్తివేస్తే భారత జీడీపీ 2020–21లో హీనపక్షం మైనస్‌ 5 శాతానికి పడిపోవచ్చని చాలా సంస్థలు అంచనాలను ఇప్పటికే విడుదల చేశాయి.

గరిష్టంగా మైనస్‌ 7.5 శాతం వరకు క్షీణించొచ్చని పేర్కొన్నాయి.  ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదలడం మొదలైనట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మే నెలలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి వెళ్లి క్రమంగా తగ్గడం మొదలైంది. డిజిటల్‌ లావాదేవీలు జోరందుకున్నాయి. జీఎస్‌టీ వసూళ్లు తిరిగి 90,000 కోట్ల స్థాయిని చేరాయి. సకాలంలో వర్షాల ఆగమనంతో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరిగింది’’ అని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top