యుద్ధ విమానాల కోసం సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ

DRDO Develops Advanced Chaff Technology For IAF Fighter Aircraft - Sakshi

శత్రు రాడర్ల నుంచి భారత వైమానిక దళం(ఐఎఎఫ్) యుద్ధ విమానాలను రక్షించడం కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ(హెచ్ఈఎంఆర్ఎల్) సహకారంతో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని డీఆర్‌డీఓ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. భారత యుద్ధ విమానాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు శత్రువుల మిసైల్స్ ను తప్పుదోవ పట్టించడానికి ఈ టెక్నాలజీ ఒక డెకాయ్ గా పనిచేస్తుంది. ఇప్పటికే విజయవంతంగా యూజర్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ టెక్నాలజీ  వినియోగించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. (చదవండి: టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు)

ప్రస్తుత ఆధునిక రాడార్ టెక్నాలజీ కాలంలో మన యుద్ద విమానాలను రక్షించడానికి ఇలాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. ఈ క్రిటికల్ టెక్నాలజీని స్వదేశీ అభివృద్ధి కోసం తయారు చేసిన డీఆర్‌డీఓ, ఐఎఎఫ్ & విమానయాన పరిశ్రమను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది ఆత్మనీర్భర్ భారత్ దిశగా మరో ముందు అడుగు అని అన్నారు. ఐఎఎఫ్ ను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు రక్షణ శాఖ కార్యదర్శి ఆర్ అండ్ డీ, డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ జీ.సతీష్ రెడ్డి బృందాలను అభినందించారు. ఆధునిక రాడార్ టెక్నాలజీ పురోగతి చెందటంతో యుద్ధ విమానాల మనుగడ ప్రధాన ఆందోళన కలిగిస్తోందని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ మనుగడ కోసం ఇన్ ఫ్రారెడ్ & రాడార్ టెక్నాలజీ నుంచి తప్పించుకోవడానికి కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సీస్టమ్ (సీఎమ్ డీఎస్) ఉపయోగపడుతుంది అని అన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top