ఎక్సైడ్‌ లైఫ్‌ స్మార్ట్‌ ఇన్‌కం ప్లాన్‌

Details about Exide Life smart income Plan - Sakshi

ప్రైవేట్‌ రంగ ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా స్మార్ట్‌ ఇన్‌కం ప్లాన్‌ను ఆవిష్కరించింది. పదవీ విరమణ తర్వాత కూడా స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్‌ సంజయ్‌ తివారీ తెలిపారు. సాధారణంగా పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక లక్ష్యాలను సాధించుకునేందుకు, ఒకవేళ అప్పటికే రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకున్నా సరిపోకపోవచ్చని, స్థిరంగా మరో ఆదాయం కూడా ఉంటే సహాయకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

ఈ ప్లాన్‌లో ఎన్‌హాన్స్‌డ్‌ ఇన్‌కం, ఎన్‌హాన్స్‌డ్‌ మెచ్యూరిటీ అని రెండు వేరియంట్స్‌ ఉంటాయని తివారీ తెలిపారు. ప్రీమియం చెల్లింపు వ్యవధితో పోలిస్తే పాలసీదారు ఆదాయం పొందే వ్యవధి రెట్టింపుగా ఉండటం, జీవిత బీమా కవరేజీ తదితర ప్రయోజనాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి తోడ్పడగలవన్నారు.  
 

చదవండి: తెలంగాణకు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top