Amazon layoffs: నంబర్‌ గేమ్ అంతే..రేపటితో తొమ్మిదేళ్లు..ఇంతలోనే!

A day before completing 9 years at AWS laid off company employee viral post - Sakshi

సాక్షి, ముంబై: టెక్‌ దిగ్గజం అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 100మందిని తొలగించనుంది. అమెజాన్ తన వ్యాపారాలను క్రమ బద్ధీకరించుకునే ప్రయత్నంలో భాగంగా అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ వీడియో విభాగంలో ఈ ఉద్యోగాలను తొలగిస్తోంది. డివిజన్‌లోని 7వేల మంది ఉద్యోగులలో 1 శాతం మందిపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది.  (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్‌: సంబరాల్లో ఉద్యోగులు)

ఆర్థిక  సంక్షోభం  ఆందోళనల నేపథ్యంలో టెక్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్  సంస్థలు ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఉద్యోగులను  తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్‌ తాజా  నిర్ణయం  తీసుకుంది.  క్లౌడ్ సర్వీసెస్ డివిజన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) విభాగంలో అమెజాన్ తొలగింపుల తాజా రౌండ్  తొలగింపులు షురూ అయ్యాయి. అమెరికా,  కోస్టారికా కెనడాలోని ఉద్యోగులకు వారి ఉద్యోగ తొలగింపులకు సంబంధించి సమాచారం అందించింది. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్‌ లవ్‌ స్టోరీ తెలుసా? ఈ లవ్‌ బర్డ్స్‌ పెళ్లి ఒక రికార్డ్‌ )

జాబ్-సెర్చ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్‌లో ప్రభావిత ఉద్యోగి భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేశారు.అమెజాన్‌లోవెబ్‌ సర్వీసెస్‌లో 9 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కేవలం ఒక్క రోజు ముందు అకస్మాత్తుగా తనకు కంపెనీ ఉద్వాసన పలికిందని ఆమె వాపోయారు. ఈ మేరకు కంపెనీకి ఒక వీడ్కోలు సందేశాన్ని పోస్ట్‌ చేశారు. సామూహిక తొలగింపుల మధ్య ఇదొక నంబరు గేమ్‌..ఇపుడు నా టైం వచ్చిందంతే..నో హార్డ్‌ ఫీలింగ్స్‌  అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే  ఇన్ని రోజులు కంపెనీలో ఎదుగుదలకు ఇచ్చిన అవకాశాలకు  కృతజ‍్క్షతలు  తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top