Pakistan Economic Crisis: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ!

Crisis Hit Pakistan Allowed Over Essential Consumer Goods Remained Stuck At Ports - Sakshi

ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న దాయాది దేశానికి జల రవాణా స్తంభించినట్లు తెలుస్తోంది. పాక్‌ దిగుమతి చేసుకోవాలనుకున్న 2వేల లగ్జరీ కార్లతో పాటు నిత్యవసర వస్తువులు సైతం సముద్రమార్గాన నిలిచిపోయినట్లు పాక్‌ మీడియా సంస్థ డాన్‌ తెలిపింది. 

పాకిస్తాన్‌లో ఆర్ధిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే అప్పులిచ్చేందుకు ఆర్ధిక సంస్థలు వెనకాడుతుండగాగా..విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. గతేడాది డిసెంబర్‌ 30తో గడిచిన వారానికి పాకిస్తాన్‌ కేంద్ర బ్యాంక్‌ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 డాలర్లకు పడిపోయాయి.ఇది ఎనిమిదేళ్ల కనిష్టస్థాయి అని డాన్‌ ప్రచురించింది. 

ఖజనా ఖాళీ
తాజాగా పాక్‌ ఖజనాలో విదేశీ మారక ద్రవ్యం లోటుతో అప్పులు, అవసరాల్ని తీర్చుకోలేక ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల్ని నిలిపివేసింది. ఆ దిగుమతుల్లో గతేడాది జులై నుంచి డిసెంబర్‌ మధ్య కాలానికి చెందిన 164 లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నాయి. వినియోగించిన లగ్జరీ వాహనాల దిగుమతులు కూడా పెరిగాయని డాన్ వార్తాపత్రిక నివేదిక పేర్కొంది.

తగ్గిన కొనుగోలు శక్తి
నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో పాకిస్థాన్ దాదాపు 1,990 వాహనాలను దిగుమతి చేసుకుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు చాలా వరకు దిగుమతులు జరిగాయని, అక్టోబరు నుండి డిసెంబరు వరకు చాలా తక్కువ సంఖ్యలో కార్ల దిగుమతి అవుతున్నాయని సీనియర్ కస్టమ్స్ అధికారులు చెప్పినట్లు డాన్‌ పత్రిక నివేదించింది. కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల వాహనాల దిగుమతులు తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయం ‍వ్యక్తం చేస్తున్నారు. 

5వేల కంటైనర్ల నిండా
మరోవైపు, ఓడరేవుల వద్ద ఫుడ్‌,బేవరేజెస్‌,క్లోతింగ్‌,షూస్‌,గ్యాస్‌ ఆయిల్‌తో పాటు ఇండస్ట్రియల్‌ గూడ్స్‌ ప్రొడక్ట్‌లైన ఎలక్ట్రిక్‌ వస్తువులతో ఉన్న 5 వేల కంటే ఎక్కువ కంటైనర్‌లను ఉంచినట్లు హైలెట్‌ చేసింది. 

పాక్‌ పర్యటనలో ఐఎంఎఫ్‌ బృందం
ఇక డిసెంబర్‌ నెల నాటికి పాకిస్తాన్ వద్ద  విదేశీ మారక నిల్వలు 5.5 బిలియన్లు ఉండగా ప్రస్తుతం అవికాస్త కనిష్ట స్థాయిలో 3.7 బిలియన్లకు పడిపోయాయి. అయితే ఈ అప్పుల నుంచి బయట పడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రతినిధుల బృందం ఈ వారం  పాక్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో అక్కడి పరిస్థితుల్ని అంచనా వేసి రుణాల్ని అందించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top