క్రెడ్, అప్‌గ్రాడ్, గ్రో.. స్పీడ్‌ | CRED, upGrad, Groww, Zepto top LinkedIn Indian startup list | Sakshi
Sakshi News home page

క్రెడ్, అప్‌గ్రాడ్, గ్రో.. స్పీడ్‌

Sep 29 2022 6:27 AM | Updated on Sep 29 2022 6:27 AM

CRED, upGrad, Groww, Zepto top LinkedIn Indian startup list - Sakshi

న్యూఢిల్లీ: అనిశ్చిత పరిస్థితుల్లోనూ దేశీయంగా 25 స్టార్టప్‌లు నిలకడను ప్రదర్శించినట్లు ఆన్‌లైన్‌ ప్రొఫె షనల్‌ నెట్‌వర్క్‌ లింక్‌డ్‌ఇన్‌ పేర్కొంది. ఈ ఏడాది (2022)కి లింక్‌డ్‌ఇన్‌ తాజాగా రూపొందించిన స్టా ర్టప్‌ల జాబితాలో మూడు కంపెనీలు టాప్‌ ర్యాంకు ల్లో నిలిచాయి. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ సంస్థ క్రెడ్, ఆన్‌లైన్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ అప్‌ గ్రాడ్, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ గ్రో అగ్రస్థానాన్ని పొందినట్లు జాబితా తెలియజేసింది. 6.4 బిలియన్‌ డాలర్ల విలువతో క్రెడ్‌ తొలి టాప్‌ చైర్‌ను కైవసం చేసుకోగా.. అప్‌గ్రాడ్, గ్రో తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి.  

కొత్త కంపెనీలు
ప్రస్తుత ఏడాది జాబితాలో కొత్తగా ఈ గ్రోసరీ కంపెనీ జెప్టో(4వ ర్యాంకు), ఫుల్‌స్టాక్‌ కార్ల కొనుగోలు ప్లాట్‌ఫామ్‌ స్పిన్నీ(7వ ర్యాంకు), ఇన్సూరెన్స్‌ స్టార్టప్‌ డిటో ఇన్సూరెన్స్‌(12వ ర్యాంకు)కు చోటు లభించినట్లు లింక్‌డ్‌ఇన్‌ వెల్లడించింది. ఈ బాటలో ఫిట్‌నెస్‌ ప్లాట్‌ఫామ్‌ అల్ట్రాహ్యూమన్‌ 19వ స్థానాన్ని పొందగా, ఆర్గానిక్‌ ఫుడ్‌ మార్కెట్‌ప్లేస్‌ లివింగ్‌ ఫుడ్‌ 20వ ర్యాంకులో నిలిచినట్లు పేర్కొంది. వినియోగదారులు ఇటీవల ఆరోగ్యకర జీవన విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సంస్థలు జాబితాలో కొత్తగా చోటు సాధించినట్లు వివరించింది.

కాగా.. టాప్‌–10లో స్కైరూట్‌ ఏరోస్పేస్‌(5వ ర్యాంకు), ఎంబీఏ చాయ్‌ వాలా(6), గుడ్‌ గ్లామ్‌ గ్రూప్‌(8), గ్రోత్‌స్కూల్‌(9), బ్లూస్మార్ట్‌(10) చోటుచేసుకున్నాయి. ఇతర సంస్థలలో షేర్‌చాట్, సింపుల్, రేపిడో, క్లాస్‌ప్లస్, పార్క్‌ప్లస్, బ్లిస్‌క్లబ్, డీల్‌షేర్, ఫామ్‌పే, అగ్నికుల్‌ కాస్మోస్, స్టాంజా లివింగ్‌ పాకెట్‌ ఎఫ్‌ఎం, జిప్‌ ఎలక్ట్రిక్‌కు చోటు దక్కింది. ఇందుకు 2021 జులై నుంచి 2022 జూన్‌ వరకూ ఉద్యోగ వృద్ధి, నిరుద్యోగుల ఆసక్తి తదితర నాలుగు అంశాలను పరిగణించినట్లు లింక్‌డ్‌ఇన్‌ తెలియజేసింది. ఇక టాప్‌–25 స్టార్టప్‌లలో 13 బెంగళూరుకు చెందినవికావడం గమనార్హం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement